రేవంత్ రెడ్డి అత్యవసర హస్తిన పర్యటన!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అత్యవసరంగా ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ‘సర్(SIR)’ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలను ఢిల్లీ పోలీసులు ఆకస్మాత్తుగా అరెస్ట్ చేయడాన్ని ఇండియా కూటమి (INDIA Bloc) నేతలు ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి నిర్బంధించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఇండియా కూటమి చేపడుతున్న మహా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి హస్తిన బాట పట్టారు.

కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ సర్కార్ యత్నిస్తోందని నిన్న ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) అరెస్ట్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో ఇండియా అగ్రనేతలతో భేటీ అయి, ఈ ఆందోళన వేదికల నుంచి కేంద్ర వైఖరిపై పోరాట కార్యాచరణను మరింత ఉధృతం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Also Read : ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులు ఖరారు.. ఉత్తర్వులు జారీ!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>