అంగన్‌వాడీ కేంద్రంలో కూలిన పైకప్పు: విద్యార్థులకు గాయాలు

కలం, వెబ్ డెస్క్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అంకుసాపూర్-తెలిగూడ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. కేంద్రం పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడటం (Anganwadi Roof Collapse)తో అక్కడే ఉన్న ముగ్గురు చిన్నారులతో పాటు ఇద్దరు తల్లులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో చిన్నారులు సాత్విక్ (3), నిహారిక (4), సాయినాథ్ (5)తో పాటు వారి తల్లులు సోనీ, సంధ్యారాణి గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అంగన్‌వాడీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని, ప్రత్యామ్నాయ భవనానికి మార్చాలని గతంలోనే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని బాధితుల కుటుంబసభ్యులు తెలిపారు. తమ విన్నపాలను అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతోనే ఈ రోజు ఈ దుర్ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. శిథిలావస్థలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల భద్రత గాలిలో దీపంలా మారిందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>