సీఎం రేవంత్, సినీ నటిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు..!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) పాటు ఓ సినీ నటిని లక్ష్యంగా చేసుకుని ‘DIG TV’ (ప్యారడీ) అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా వరుసగా అసభ్యకరమైన పోస్టులు పెడుతుండటం తీవ్ర కలకలం రేపింది. సదరు ఎక్స్ ఖాతా ద్వారా సీఎం విల్లా, ఫాంహౌస్‌, లగ్జరీ కారును ఆ సినీ నటికి గిఫ్టుగా ఇచ్చారంటూ ఎలాంటి ఆధారాలు లేని వ్యాఖ్యలతో వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత, అడ్వకేట్ కైలాష్ సజ్జన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో మహిళా నటి గౌరవానికి భంగం కలిగిస్తూ, ప్రభుత్వంపై ప్రజల్లో ద్వేషాన్ని పెంచే ఉద్దేశంతోనే ఈ దుష్ప్రచారానికి తెగబడ్డారని ఆయన హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంతో పాటు సదరు నటి చిత్రాలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టు చేసిన ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకోవాలని , పోస్టును తొలగించేందుకు ఎక్స్ సంస్థకు నోటీసులు ఇవ్వాలని కోరారు.

కైలాష్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ తప్పుడు పోస్టులు పెట్టిన అకౌంట్ నిర్వహకుల ఐపీ లాగ్‌లను భద్రపరచడంతో పాటు, సదరు ఖాతాను వెంటనే బ్లాక్ చేయాలని, పోస్టులను తొలగించాలని కోరుతూ ఎక్స్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ పోస్టు వెనుక ఉన్న అసలు సూత్రధారులను సాంకేతిక ఆధారాల సహాయంతో త్వరలోనే పట్టుకుంటామని అధికారులు అంటున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>