ట్యాంక్ బండ్‌పై ఘోర ప్రమాదం.. పుట్టినరోజు వేడుకల్లో తీవ్ర విషాదం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ (Tank Bund) పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Accident) ఒకే కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఎంతో సంతోషంగా వచ్చిన ఆరేళ్ల చిన్నారితో పాటు ఆమె బంధువు లారీ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. మేడ్చల్–మల్కాజిగి జిల్లా ఓల్డ్ అల్వాల్‌లోని జొన్నబండ ప్రాంతంలో సాయినాథ్, అశ్విని దంపతులు మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తూ నివసిస్తున్నారు. వీరికి శరణ్య(9), సరాక్షి (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదే మీసేవ కేంద్రంలో మూడు నెలల క్రితమే వివాహమైన యశ్వంత్ (40), సింధు దంపతులు కూడా పని చేస్తున్నారు.

అయితే చిన్నారి సరాక్షి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి సెకండ్ షో సినిమా చూశారు. సినిమా ముగిసిన తర్వాత, అర్ధరాత్రి దాటాక ట్యాంక్ బండ్ పై కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు జరుపుకోవాలని అందరూ కలిసి అక్కడికి చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పై కారు పార్క్ చేసి , హుస్సేన్ సాగర్ వైపు వెళ్లేందుకు వారు రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో సికింద్రాబాద్ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ రోడ్డు దాటుతున్న సరాక్షి, విశ్వంత్‌లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సరాక్షి అక్కడిక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన యశ్వంత్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కూడా మరణించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>