కలం/ఖమ్మం బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాలేరులో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతుండగా.. సభలోకి కొందరు టీడీపీ జెండాలతో బైక్ ర్యాలీ చేస్తూ వచ్చారు. టీడీపీ ఫ్యాన్స్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో టిడిపిపై ఉక్కు పాదం మోపి నష్టం కలిగించిన బీఆర్ఎస్ ను బొందపెడదాం కలసి రండి. అదే సీనియర్ ఎన్టీఆర్ కు ఘన నివాళి. తెలంగాణలో టీడీపీపై మాజీ సీఎం కేసీఆర్ కక్షగట్టి దెబ్బతీశారు‘ అంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
బీఆర్ ఎస్ ను వెయ్యి మీటర్ల గొయ్యి తీసి బొందపెట్టినా తప్పులేదన్నారు సీఎం రేవంత్ (Revanth Reddy). ‘ఊర్లల్లో బీఆర్ ఎస్ పార్టీ నేతలు గద్దె దిగాలి. కారు పార్టీ దిమ్మెలు కూలాలి. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇదే నా విజ్ఞప్తి. బీఆర్ ఎస్ ను సమూలంగా బొంద పెడితేనే సీనియర్ ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అవుతుంది. ఆ బాధ్యత మనందరి మీద ఉంది‘ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో.. అక్కడకు వచ్చిన టీడీపీ అభిమానులు కేరింతలు కొట్టారు.


