కలం, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రి ప్రాంగణం వద్ద ఉన్నట్లుండి భారీ సంఖ్యలో బ్యానర్లు వెలియడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రితో పాటు దానికి ఇరువైపులా ఉన్న ప్రధాన రహదారికి ఇరువైపులా బ్యానర్లను ఏర్పాటు చేశారు. ‘Congratulations రేవంత్ గారు.. రూ.13,200 కోట్లు’ అంటూ ప్రస్తావించిన వ్యాఖ్యలు ఉన్నాయి.
ఇటీవలే మెడికవర్ ఆస్పత్రికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాత్రికి రాత్రే ఈ బ్యానర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా బ్యానర్లు (Revanth Reddy Banners) ఏర్పాటు చేశారనే ప్రచారం సాగుతోంది. మార్నింగ్ వాకర్స్, రాకపోకలు సాగించే వాహనదారులు వీటిని ఆసక్తిగా చూస్తూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ బ్యానర్లను ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

