కలం, వెబ్‌డెస్క్: చెక్ బౌన్స్ కేసు(Cheque Bounce Case)లో ఒంగోలు కోర్టు ఇచ్చిన తీర్పుపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ (Bandla Ganesh) స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఈ తీర్పుపై ఆయనపై కోర్టుకు వెళ్లున్నట్లు పరోక్షంగా ఆయన పోస్టులో వెల్లడించారు. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలపై ఆయనకు పూర్తి గౌరవం ఉందన్నారు. భారత ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యవస్థకు ప్రత్యేక గౌరవం, బాధ్యత ఉన్నాయన్నారు. జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీం కోర్టు వరకు న్యాయం కోరేందుకు రాజ్యాంగం మనకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకంతో, చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతానని తన పోస్టులో వెల్లడించారు. తద్వారా ఆయన ఒంగోలు కోర్టు తీర్పును అంగీకరించలేదని అర్థమవుతోంది. బండ్ల గణేశ్ నెక్ట్స్ హైకోర్టులను ఆశ్రయించనున్నారని తెలుస్తోంది.
ఈ కేసు కథేంటంటే..
ప్రకాశం జిల్లాలోని మద్దిరాలపాడుకు చెందిన జట్టి వెంకటేశ్వర రావుకు బండ్ల గణేశ్ (Bandla Ganesh) రూ.95 లక్షలు అప్పు ఉన్నారు. ఈ అప్పునకు సంబంధించి పరమేశ్వర ఆర్ట్స్ నుంచి బండ్ల గణేశ్ ఆయనకు ఓ చెక్ ఇచ్చాడు. ఈ చెక్ బౌన్స్ కావడంతో నిందితుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు ఒంగోలు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా విధించింది.
Also Read : తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బ రిలేషన్ పై అఫిషియల్ ప్రకటన!
Follow Us On : WhatsApp

