Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌లో దారుణం.. రిటైర్డ్ IPS భార్య హత్య!

కలం, వెబ్‌ డెస్క్‌ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) ప్రశాసన్ నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద (55) తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆమెను హతమార్చిన అనంతరం ఇంట్లోని భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలతో పరారైనట్లు సమాచారం అందుతోంది.

ఈ నేరంలో ఇంట్లో పనిచేసే నేపాలీ పనిమనుషుల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఒక నేపాలీ మహిళను పనిమనిషిగా చేర్చుకున్నారని, ఆమె మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. సునంద ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితులు ఆమెను ఊపిరాడకుండా చేసి చంపినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే డీజీపీ సీవీ ఆనంద్ సహా ఉన్నతాధికారులు క్వార్టర్స్‌కు చేరుకుని పరిశీలించారు. పరారీలో ఉన్న నేపాలీ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>