హీరో సుమన్‌కు కత్తి కాంతారావు జాతీయ పురస్కారం

కలం, సినిమా : ప్రముఖ నటుడు సుమన్ (Actor Suman) కు కత్తి కాంతారావు జాతీయ పురస్కారం-2026 ను ప్రకటించారు. తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ పోరం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతీ సంవత్సరం ఈ అవార్డును అందిస్తోంది. 2026 జాతీయ పురస్కారానికి గాను సుమన్ ఎంపికయ్యారు. సుమారు 300కు పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో ఆయన నటించారు.

శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ రాముడు, శ్రీకృష్ణుడిగా, యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా, యాక్షన్ చిత్రాల హీరోగా నటించి ప్రేక్షకుల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించుకున్నాడు. నటుడు సుమన్ కు ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం’ (Kathi Kantha Rao National Award) తో సత్కరించాలని తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ పోరం అండ్ భారత్ కల్చరల్ అకాడమీ సభ్యులు తీర్మానించారు. ఈ అవార్డ్ ను హైదరాబాద్ లో కాంతారావు పుట్టిన రోజైన నవంబర్ 16వ తేదీన ప్రదానం చేయనున్నట్టు అవార్డు కమిటీ చైర్మెన్ కేవీ రమణా చారి, కో చైర్మన్స్ పార్థసారథి, నాగబాల, సురేష్ కుమార్ లు తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>