epaper
Sunday, March 1, 2026
epaper

కుమ్మెర ఘటన.. రేణూ దేశాయ్ పై ట్రోల్స్.. ఎందుకు..?

కలం, డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మర గ్రామంలో జరిగిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రతి ఒక్కరూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి రేణు దేశాయ్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. మధ్యలో రేణు దేశాయ్ (Renu Desai) ఏం చేసింది అనేది చాలామంది ప్రశ్న. అయితే రీసెంట్ గా వీధి కుక్కలను పట్టుకెళ్ళాలి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రేణు దేశాయ్ ప్రెస్ మీట్ పెట్టి ఎమోషనల్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే వీధి కుక్కలను తరలిస్తున్న అధికారులపై సీరియస్ అయ్యారు. మగవారు అత్యాచారాలు చేస్తున్నారు కాబట్టి మగవాళ్లందరినీ చంపేయాలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు కుక్కలు కరిస్తే అన్ని కుక్కలను చంపడం ఏంటని ప్రశ్నించారు.

అయితే ఇప్పుడు కుమ్మెర ఘటనపై ఆమె మాట్లాడకపోవడంతో.. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కుక్కలను చంపితే అంత బాధపడిన రేణు దేశాయ్ (Renu Desai) కు.. ఒక పసిపాప చనిపోతే కనిపించట్లేదా అంటూ మండిపడుతున్నారు. కుక్కలపై ఉన్న ప్రేమ మనుషులపై లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. రేణు దేశాయ్ మాట్లాడిన వీడియోను అలాగే కుమ్మెర ఘటన వీడియోను లింక్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ రెండింటికీ కేరళ సినిమా జనగణమనలోని కోర్టు సీన్ డైలాగులు యాడ్ చేస్తున్నారు. ఒక కుక్కను చంపితే ప్రశ్నించడానికి వందమంది వచ్చే ఈ రోజుల్లో.. ఒక మనిషిని చంపితే ఏ కుక్క రాదు అనే ధైర్యం వీళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది అనే డైలాగ్ ను బాగా ఇప్పుడు పాపులర్ చేస్తున్నారు. దీంతో రేణు దేశాయ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి ఈ ఘటనపై ఆమె ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!