Mobile Popup Ad
Mobile Popup Ad

50 లక్షలతో రోడ్డు మరమ్మతులు

కలం/ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, బీటీపీఎస్ రోడ్డు గుంతలమయంగా మారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోడ్డు మరమ్మతు చేసేందుకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రూ.50 లక్షలు కేటాయించారు. వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా మణుగూరు నుంచి బీటీపీఎస్ వైపు వెళ్లే వాహనదారులు గుంతల మయంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక కంకర తేలిన రోడ్డుపై దుమ్ము ధూళి వ్యాపించి ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. అయితే రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు కావడంతో, స్థానికులతో పాటు వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కలం వెబ్ సైట్ లోనూ ఈ సమస్యకు సంబంధించి వరస కథనాలు వచ్చాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>