Mobile Popup Ad
Mobile Popup Ad

దాంపత్య బంధం బలపడాలంటే ప్రతి జంట పాటించాల్సిన టిప్స్ ఇవే!

కలం, వెబ్ డెస్క్: నేటి కాలంలో దంపతులు చిన్న చిన్న విషయాలకే తరచూ గొడవలు పడుతుంటారు. ప్రతీ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ వివాహ బంధాన్ని మధ్యలోనే వదిలేసి విడాకుల దాకా వెళుతుంటారు. అయితే పెళ్లి అయినప్పటి నుంచే కొన్ని రూల్స్ పాటించడం వలన ఇలాంటి సమస్యలు తలెత్తవంటున్నారు నిపుణులు. అసలు ఆ నియమాలు (Relationship Tips) ఏంటో ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. భార్యాభర్తలు అంటే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించం కాదు.. ఒకరితో ఒకరు స్నేహితుల్లా మెలగాలంటున్నారు నిపుణులు. పరస్పరం అభిరుచుల్ని గౌరవించుకోవడం, ఆలోచనల్ని అర్థం చేసుకోవడం, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం.. ఇలా స్నేహితులలాగా కలిసిపోయినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు అంశాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఏడాదికోసారి వెకేషన్

సాధారణంగా పెళ్లైన కొత్తలో భార్యభర్తలు ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళుతుంటారు. కానీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ బాధ్యతలు పెరుగుతుంటాయి. వారి జీవితంలోకి పిల్లలు వస్తారు. దీంతో ఇద్దరి మధ్య ఏకాంతం కొరవడుతుంది. అందుకే ఏడాదికోసారి ఒక వారం రోజుల పాటు దంపతులిద్దరే వెకేషన్ కి వెళ్లేలా ప్లాన్ చేసుకోమంటున్నారు నిపుణులు. ఇలా ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపే ఈ సమయంలో.. ఒకరిపై ఒకరు మరింత శ్రద్ధ పెట్టగలుగుతారు. తమ తమ బాధ్యతల నుంచి రిలాక్స్ అవుతూ.. పునరుత్తేజితం అయ్యేందుకు ఇదే సరైన సమయం. ఇవన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా దంపతుల మధ్య అనుబంధాన్ని రెట్టింపు చేసేవేనని చెబుతున్నారు నిపుణులు.

‘డేట్ నైట్’ ప్లాన్!

ప్రస్తుత రోజుల్లో ఇంటి బాధ్యతలు, ఆఫీస్ పనుల వల్ల ఈ కాలపు జంటలకు కలిసి గడిపే సమయమే దొరకట్లేదు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగిపోతోంది. అందుకే ఇలా జరగకుండా.. వారానికొక రోజు ఇద్దరూ కలిసి ఏకాంతంగా డేట్ నైట్ ప్లాన్ చేసుకోమంటున్నారు నిపుణులు. ఇంట్లో ఆ వీల్లేకపోతే.. బయటికి డిన్నర్ కి వెళ్లచ్చు.. సినిమాకో, లాంగ్ డ్రైవ్ కో ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ఇద్దరికీ దొరికిన ఈ ఏకాంత సమయంలో బోలెడన్ని విషయాలు పంచుకోవచ్చు. ఫలితంగా ఇద్దరి మధ్య మానసికంగా బంధం బలపడుతుంది. ఇది పరోక్షంగా దాంపత్య బంధం పైనా సానుకూల ప్రభావం చూపుతుంది అంటున్నారు నిపుణులు.

వారానికో రోజైనా..!

దాంపత్య బంధాన్ని నిత్యనూతనం చేసే అంశాల్లో శృంగారానిది కీలక పాత్ర. అయితే ఈ కాలపు జంటల్లో చాలామంది తమ బిజీ లైఫ్ స్టైల్ వల్ల దీనికి తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. మరికొందరిలో ఒత్తిడి, ఇతర కారణాల వల్ల లైంగిక కోరికలు తగ్గిపోయి.. శృంగార జీవితానికి దూరమవుతున్నారు. అలాగని దీన్నిలాగే నిర్లక్ష్యం చేస్తే అనుబంధానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే కనీసం వారానికో రోజైనా శృంగార జీవితానికి ప్రాధాన్యమివ్వమంటున్నారు. ఈ క్రమంలో ఒకరికొకరు తమ ఆలోచనల్ని, కోరికల్ని అర్థం చేసుకొని మసలుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇది క్రమంగా ఇద్దరినీ శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా మరింత దగ్గర చేస్తుంది.

డిజిటల్ డీటాక్స్ పద్ధతి

ఆలుమగల మధ్య అనుబంధం సన్నగిల్లడానికి గ్యాడ్జెట్స్ కూడా ఓ కారణమని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. రాత్రి భాగస్వామితో ఏకాంతంగా గడపాల్సిన సమయంలోనూ వీటికే ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణమంటున్నాయి. అందుకే ప్రతి జంటా రోజూ రాత్రి పూట డిజిటల్ డీటాక్స్ పద్ధతిని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లన్నీ పక్కన పెట్టి ఆలుమగలిద్దరూ ఒకరితో ఒకరు సమయం గడిపేలా ప్లాన్ చేసుకోమంటున్నారు. ఈ సమయంలో మీ కెరీర్ అనుభవాలు భాగస్వామితో పంచుకోవచ్చు.. లేదంటే కాసేపు రొమాంటిక్ గా మాట్లాడుకోవచ్చు. రోజూ ఇలా గడపడం వల్ల ఒకరిపై ఒకరికి ఆసక్తి పెరుగుతుంది. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సమస్యలేవైనా ఉన్నా తొలగిపోతాయి. ఫలితంగా ప్రతి విషయంలోనూ ఇద్దరూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ.. ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్లగలుగుతారు. అనుబంధాన్ని దృఢం చేసుకోవాలంటే ఇవే కీలకం అంటున్నారు నిపుణులు.

Read Also: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: 21 మంది సజీవ దహనం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>