మార్క్‌ఫెడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా రావణ దహనం

కలం, కరీంనగర్ బ్యూరో: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్ గ్రౌండ్స్‌లో (Markfed Grounds) రాంలీలా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రావణ దహన(Ravana Dahan) కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి అంటేనే విజయం, ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు.

ఢిల్లీలో నిర్వహించే రాంలీలా కార్యక్రమం తరహాలో కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్ గ్రౌండ్స్‌లో కూడా రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పల్లెల్లోనూ విజయదశమి వేడుకలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని తెలిపారు. చెడుపై మంచి విజయం సాధించాలని, ప్రజలందరి జీవితాల్లో విజయాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>