ట్రాఫిక్ పోలీసుల భద్రత కోసం.. రిఫ్లెక్టివ్ బెల్ట్‌ల పంపిణీ

కలం, పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి (Ramagundam Police)లో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రహదారులపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల భద్రత కోసం రిఫ్లెక్టివ్ బెల్ట్‌లు, బాడీ బెల్ట్‌లు,రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా ఉపయోగపడే భద్రతా పరికరాలను పంపిణీ చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో చౌరస్తాలు, ప్రధాన రహదారులపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసు సిబ్బంది వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా ఈ రిఫ్లెక్టివ్ పరికరాలు ఉపయోగపడతాయని తెలిపారు.

విధుల నిర్వహణలో సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు.ట్రాఫిక్ నియంత్రణలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ పోలీసుల భద్రతతో పాటు వాహనదారులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు,ఆర్‌ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>