నషా ముక్త్‌ భారత్‌.. హనుమకొండలో అవగాహన ర్యాలీ

కలం, హనుమకొండ: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌, జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షురాలు చాహత్‌ బాజ్‌పాయి పిలుపునిచ్చారు. నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా బుధవారం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని (Anti-Drug Awareness Rally) కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఆమె ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌ మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువత తమ శక్తి, ప్రతిభను విద్య, క్రీడలు, సామాజిక సేవ, దేశ నిర్మాణం వంటి సానుకూల కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ మత్తు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆర్ట్స్‌ కళాశాల నుంచి హనుమకొండ రెడ్‌క్రాస్‌ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ పి. విజయచందర్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ సుంకరి జ్యోతి, విద్యార్థులు, రెడ్‌క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>