జడేజా టాప్ ప్లేస్‌కు గండి..!

కలం, స్పోర్ట్స్​ : నాలుగేళ్లకు పైగా ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌ (All-Rounder Rankings) ను ఏలిన భారత స్టార్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కు గట్టి షాక్ తగిలింది. సుదీర్ఘ కాలంగా అనుభవిస్తున్న నంబర్ 1 స్థానాన్ని ఆయన కోల్పోయారు. సౌతాఫ్రికాకు చెందిన యువ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ అద్భుత ప్రదర్శనతో జడేజాను వెనక్కి నెట్టి తొలిసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియాతో గెబర్‌హాలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. బ్యాట్‌తో 85 పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్‌లో 5 వికెట్లతో చెలరేగి సౌతాఫ్రికాకు భారీ విజయాన్ని అందించారు.

ఈ సంచలన ప్రదర్శనతో జాన్సెన్ ఒకేసారి జడేజాను వెనక్కి నెట్టి నంబర్ 1 టెస్టు ఆల్‌రౌండర్‌గా, అలానే మిచెల్ స్టార్క్‌ను దాటి నంబర్ 1 టెస్టు బౌలర్‌గా నిలిచారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ 13 స్థానాలు ఎగబాకి 56వ ర్యాంక్‌కు చేరుకున్నారు. మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మళ్లీ సంచలనం సృష్టించారు. న్యూజిలాండ్‌పై వెల్లింగ్టన్‌లో జరిగిన మూడో టీ20లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది, మొత్తంగా 38 బంతుల్లో 113 పరుగులు చేశారు.

ఈ శతకంతో ఇషాన్ కిషన్‌ను దాటుకుని మళ్లీ నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా నిలిచారు. మిగతా ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే, ఆస్ట్రేలియాపై మెరిసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టెస్టు బ్యాటర్లలో రెండో స్థానానికి చేరారు. ఇక వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లీ మూడో ర్యాంక్‌లో, రోహిత్ శర్మ నాలుగో ర్యాంక్‌లో ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>