పట్టభద్రుల ఓటరు నమోదుపై ఎర్రబెల్లి పిలుపు

కలం, జనగామ: ఉద్యోగాల హామీతో నిరుద్యోగులను మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) డిమాండ్‌ చేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా దేవరుప్పుల (Devaruppula) మండల కేంద్రంలోని అక్షర గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు, సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు, యువతకు ఉపాధి, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వ పనితీరును ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. పట్టభద్రుల ఓటు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రజాస్వామ్య ఆయుధమని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించి అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>