కలం, కరీంనగర్ బ్యూరో : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS) కరీంనగర్ జిల్లా శాఖ పాలకవర్గం ఎన్నికల ప్రక్రియ (Red Cross Elections) తుది దశకు చేరుకుంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య స్పష్టమైంది. జిల్లాలో మొత్తం 17,886 మంది ఓటర్లు ఉండగా, 15 పాలకవర్గ సభ్యుల స్థానాలకు 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉపసంహరణ ప్రక్రియలో ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి, జిల్లా సహకార అధికారి ఎస్. రామానుజాచార్య తెలిపారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో బోడ సుధాకర్, డా. పోరండ్ల కిషన్, మెతుకు సత్యం, ముక్క శరత్ కృష్ణ, మ్యాడం శివకాంత్, పి. నర్సింహారావు, సాన వేణు ఉన్నారు.
బరిలో ఉన్న అభ్యర్థులు
- ఎ. మునీందర్
- క్యాప్టెన్ బి. మధుసూదన్ రెడ్డి
- సిహెచ్. సురేష్
- డా. ముప్పిడి మదన్ బాబు
- ఇఆర్. కోల అన్సారెడ్డి
- గోనె శ్రీనివాస్
- హన్మండ్ల రాజిరెడ్డి
- కనపర్తి మనోహర్ రావు
- కుందారపు మహేశ్వర్
- మొగులోజు రాకేష్
- పి. శ్రీహరి రెడ్డి
- పి. విద్యాసాగర్
- పెండ్యాల కేశవరెడ్డి
- రాగి శ్రీనివాస్
- సాయినేని నరేందర్
- సంగెం లక్ష్మణ్ రావు
- వి. రాధాకృష్ణారెడ్డి
ఎన్నికల షెడ్యూల్
అక్టోబర్ 4, 2026న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

