మెదక్ జిల్లాలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు : ఆర్డీవో రమాదేవి

కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా వ్యాప్తంగా సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని ఆర్డీవో రమాదేవి తెలిపారు. మంగళవారం మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ పంపును ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా బంకు నిర్వాహకులతో ఇంధన కొరత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లాలో ప్రస్తుతం 29,232 లీటర్ల పెట్రోల్, 26,667 లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో సరిపడా పెట్రోల్, డీజిల్ లభ్యత ఉందని, ప్రజలు, వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వెల్లడించారు. కొరత ఉందనే అపోహతో ప్రజలు బంకుల వద్ద భారీ లైన్లు కట్టడం అవసరం లేదని ఆర్డీవో సూచించారు.

Read Also: ‘పెద్ది’ మూవీ వాయిదా.. అదే అసలు కారణం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>