కలం, వెబ్ డెస్క్: ఏఐతో బ్యాంకింగ్ వ్యవస్థకు సైబర్ ముప్పు గణనీయంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ టూల్స్ కు సొంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం, సమస్యలను సొంతంగా పరిష్కరించుకునే శక్తి పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ రిస్క్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఏఐ కారణంగా మనుషుల పర్యవేక్షణ వ్యవస్థలపై మరింత తగ్గుతోందని.. ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు. థర్డ్ పార్టీ సంస్థలపై ఎక్కువవుతోందని హెచ్చరించారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దేశాల సరిహద్దులకు అతీతంగా ఒకదానికొకకటి అనుసంధానమై ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఒక్క చోట ఏర్పడే సైబర్ ముప్పు.. మిగతా దేశాల్లో ఇబ్బందులను తెచ్చి పెట్టే అవకాశం ఉందన్నారు.
సంక్షోభం నుంచి తప్పించుకోలేం..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం గురించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. దాన్నుంచి భారత్ పూర్తిగా తప్పించుకోలేదని.. ఏదో ఒక రంగంపైనా సంక్షోభం ప్రభావం ఉంటుందన్నారు. మరీ ముఖ్యంగా నిత్యావసరాల ధరల పెరుగుదల, దిగుమతులపై ఒత్తిడి రెట్టింపు స్థాయిలో ఉంటోందన్నారు. అయితే దేశంలో ద్రవ్యోల్బణం తక్కువగానే ఉందని.. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అత్యంత వేగంగా పురోగమిస్తున్న దేశంగా అభివర్ణించారు. సంక్షోభాల ఒత్తిళ్లను తట్టుకునేందుకు ఆర్బీఐ నిరంతరం చర్యలు తీసుకుంటూనే ఉందని స్పష్టం చేశారు.

