స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి.. యువతులకు ఎమ్మెల్యే సూచన

కలం, భైంసా: యువతులు ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదిగి కుటుంబాలకు అండగా నిలవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) అన్నారు. శనివారం భైంసా (Bhainsa) పట్టణంలో శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు సర్టిఫికెట్లు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతులకు వృత్తి నైపుణ్యాలు ఎంతో అవసరమని అన్నారు. నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందడంతో పాటు స్వయం ఉపాధి చేపట్టి కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడవచ్చని తెలిపారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన యువతులందరికీ ప్రభుత్వ పథకం ద్వారా కుట్టు మిషన్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>