Mobile Popup Ad
Mobile Popup Ad

పోలీసుల స‌మ‌క్షంలోనే వైసీపీ నేత‌పై హ‌త్యాయ‌త్నం: ఎంపీ మిథున్ రెడ్డి

క‌లం, వెబ్ డెస్క్‌: రాయ‌చోటిలో వైసీపీ నాయ‌కుడు ద‌శ‌ర‌థ రెడ్డిపై జ‌రిగిన దాడిపై ఎంపీ మిథున్ రెడ్డి (Midhun Reddy) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే దశరథ రామిరెడ్డిపై హత్యాయత్నం జరగడం దారుణ‌మ‌ని మిథున్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోషల్ మీడియాలో ఒక్క‌ పోస్ట్ పెడితే 40 పోలీస్ స్టేషన్లు తీప్పే పోలీసులు దాడి జరుతుంద‌ని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేద‌ని మండిప‌డ్డారు. ఇప్పటి వరకు కూడా హత్యాయత్నం చేసిన వారిని అరెస్ట్ చేయలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పోలీసుల క‌ళ్లెదుటే దౌర్జ‌న్యం జ‌రుగుతున్నా ఎందుకు ఇంత నిర్ల‌క్ష్యం అని ప్ర‌శ్నించారు. ఏపీలో దారుణ‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు. ఇలాంటి దాడులే కొన‌సాగిస్తే మ‌ళ్లీ ఇదే ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌ని హెచ్చ‌రించారు. ఈ దాడికి పాల్ప‌డిన వారిని త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని, మ‌ళ్లీ ఇలాంటి ప‌రిస్థితులు పున‌రావృతం కాకుండా చూడాల‌ని డిమాండ్ చేశారు.

Read Also:  ఫస్ట్ ఇంప్రెషన్‌ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>