గెట్ టు గెదర్ 33 ఏళ్ల తరువాత.. ఫ్రెండ్ షిప్ డే రోజు కలిసిన మిత్రులు

కలం, వలిగొండ : స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. దోస్త్ మేరా దోస్త్ తుహే మేరీ జాన్ అంటూ స్నేహితుల దినోత్సవం రోజున (Friendship Day) ప్రగతి కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థుల (1993-95) ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రగతి జూనియర్ కళాశాల ప్రథమ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు దాదాపు 33 సంవత్సరాల అనంతరం కలుసుకొని స్నేహితుల దినోత్సవాన్ని ఆత్మీయ సమ్మేళనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాసుల వెంకన్న, పబ్బు వెంకటరమణ, గంధమల్ల స్వామి రాజ్, పైళ్ల ప్రకాష్ రెడ్డి, మల్లం వెంకటేష్, జగదీశ్వర్, నూతనగంటి వెంకటేష్, పబ్బు శ్రీలత పందిరి రమ, రజిత, చిట్టెడి అరుణ, ఎల్లంకి శ్యాంసుందర్, గట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>