శ్రీరాంసాగర్‌కు జలకళ.. 31 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

కలం, నిజామాబాద్ బ్యూరో : ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) క్రమంగా జలకళ సంతరించుకుంటుంది. 31 టీఎంసీల నీటి మట్టానికి చేరుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన మంజీర నది వరద ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చిన గోదావరి నది వరద కలిపి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరింది.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)లో వారం కిందట 16 టీఎంసీల నీరే ఉండేది. ఇప్పుడు ఏకంగా 15 టీఎంసీల వరద వచ్చింది. ఆయకట్టు రైతన్నలలో ఆశలు సజీవం చేసింది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా ప్రాజెక్టు 1074.50 అడుగులకు చేరుకుంది. 31.697 టీఎంసీల సామర్థ్యానికి చేరుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివారానికి వరద మాత్రం తగ్గిపోయింది. రెండు, మూడు రోజుల వరకు 80 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కనిపించినా ప్రస్తుతం అది 22457 క్యూసెక్కుల కు పడిపోయింది. వర్షాలు తగ్గడంతో వరద కూడా తగ్గుముఖం పట్టింది. తాగు సాగు నీటి అవసరాల కోసం 822 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా పంపుహౌజ్ ల ద్వారా విడుదల చేస్తున్నారు.

Also Read : కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>