కలం, వెబ్ డెస్క్ : మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ చిత్రం ఇటీవల థియేటర్లలో రిలీజ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది. తండ్రి, కూతురు అనుబంధంతో పాటు అయ్యప్ప స్వామి మాల నేపథ్యం ఉన్న ఈ మూవీ గత నెల 21న థియేటర్లలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ స్టడీగా థియేటర్లలో వసూళ్లను రాబడుతున్న ఈ మూవీ ఓటీటీ (Irumudi OTT) స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ మేరకు పాపులర్ ఇంటర్నేషనల్ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది.
సెప్టెంబర్ 18 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భారీ ఆదరణను దక్కించుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. కాగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో రవితేజ భార్య పాత్రలో ప్రియా భవానీ శంకర్ నటించగా.. వాళ్లిద్దరి కుమార్తెగా ‘బేబీ’ నక్షత్ర కీలక పాత్ర పోషించింది. డైలాగ్ కింగ్ సాయి కుమార్, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం, బీజీఎం ప్రేక్షకులను అలరించింది.

