కలం, యాదగిరిగుట్ట: అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) జోన్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా జోన్ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం సేవాభావానికి ప్రతీకగా నిలిచింది.
ప్రజల్లో చైతన్యానికి 2కే రన్
అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా 2కే రన్‌ను కూడా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పోలీసు శాఖకు ప్రజలకు మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ బొడ్డుపెల్లి భాస్కర్, రూరల్ సీఐ మాదాసు శంకర్ గౌడ్, ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్ రావు, ఎస్ఐలు యాదయ్య, ప్రసాద్, ఖాజా మోహినూద్దీన్, ఇంద్రారెడ్డి, రూపశ్రీ, ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్, పోలీసు సిబ్బంది, కానిస్టేబుళ్లు, అధిక సంఖ్యలో యువత తదితరులు పాల్గొన్నారు.

