చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌

కలం, ఖానాపూర్‌: నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ జాతీయ ర్యాలీని (Vote Bachao–Desh Bachao Rally) విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే, నిర్మల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ (MLA Vedma Bojju Patel) పిలుపునిచ్చారు.

బుధవారం ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడం, వారి భాగస్వామ్యం, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. కార్యక్రమ విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>