రేషన్ బియ్యం కోసం ఎదురు చూపులు!

కలం, వలిగొండ: పేద ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం ఒకేసారి మూడు నెలలకు సరిపడా బియ్యం అందిస్తామని చెప్పడంతో పేద ప్రజలు ఆనందానికి అవధుల్లేవు. కానీ, దుకాణం వద్దకు ప్రతి రోజూ మూసే ఉంటోంది. గత 15 రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ (Valigonda) మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఎదురవుతున్న అనుభవమిది.

బియ్యం ఎప్పుడొస్తాయని రేషన్ డీలర్లను ప్రశ్నిస్తే తమకు స్టా కు ఇంకా పంపలేదని, రాగానే తెలియజేస్తామని చెప్పడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పనులు మానుకుని మరీ రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని.. ఎప్పుడిస్తారో స్పష్టత లేదన్నారు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించి రేషన్ బియ్యాన్ని అన్ని గ్రామాలకు త్వరగా చేరవేసేలా చర్యలు తీసుకోవాలని రేషన్ లబ్ధిదారులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>