కలం, స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ (World Cup Schedule) వచ్చేసింది. గురువారం ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే అందరి చూపు మాత్రం అక్టోబర్ 10పై ఉంది. ఆ రోజు జోహన్నెస్‌బర్గ్‌లో భారత్ టోర్నీలో తొలిసారి తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే, క్వాలిఫయర్ ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. గ్రూప్ దశలో భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టోర్నీలో భారత్(ఏ1), ఆస్ట్రేలియా (ఏ2), పాకిస్థాన్(ఏ3)గా ఉన్నాయి. ఆ తర్వాత గ్రూప్–బీ సీడింగ్‌లో న్యూజిలాండ్(బీ1), సౌతాఫ్రికా(బీ2), శ్రీలంక(బీ3)గా ఉన్నాయి. ఇక వైల్డ్ కార్డ్ స్లాట్ అయిన ఏబీ4 పొజిషన్లో ఇంగ్లండ్ ఇప్పటికే ఉంది. 2027 వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 14 జట్లు పోటీ పడనున్నాయి.
ఏబీ4 సీడ్‌ను ఎలా నిర్ణయిస్తారు?
ఒకవేళ ఇంగ్లాండ్ — లేదా మరేదైనా ముందుగా సీడింగ్ పొందిన జట్టు.. సూపర్ 7 దశకు అర్హత సాధించడంలో విఫలమైతే, వారి స్థానంలో ఏ అన్‌సీడెడ్ జట్టు అర్హత సాధిస్తుందో, ఆ జట్టుకు ఈ ఖచ్చితమైన స్లాట్ (AB4 వంటివి) లభిస్తుంది. అలాగే వారు ఇంగ్లాండ్ ఆడాల్సిన షెడ్యూల్ మ్యాచ్‌లలో పాల్గొంటారు.
2027 వన్డే ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ (World Cup Schedule)
సూపర్ సిరీస్
అక్టోబర్ 2: క్వాలిఫయర్ 1 vs క్వాలిఫయర్ 3 — విండ్‌హోక్
అక్టోబర్ 4: క్వాలిఫయర్ 1 vs క్వాలిఫయర్ 2 — విండ్‌హోక్
అక్టోబర్ 6: క్వాలిఫయర్ 2 vs క్వాలిఫయర్ 3 — విండ్‌హోక్
గ్రూప్ దశ
అక్టోబర్ 7: భారత్ vs ఆస్ట్రేలియా — కేప్‌టౌన్
అక్టోబర్ 8: పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్థాన్ — ట్ష్వానే
అక్టోబర్ 8: ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్ — విండ్‌హోక్
అక్టోబర్ 9: జింబాబ్వే vs క్వాలిఫయర్ ఏ — బులవాయో
అక్టోబర్ 9: దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ — కేప్‌టౌన్
అక్టోబర్ 10: భారత్ vs పాకిస్థాన్ — జోహన్నెస్‌బర్గ్
అక్టోబర్ 10: శ్రీలంక vs క్వాలిఫయర్ బి — విండ్‌హోక్
అక్టోబర్ 11: జింబాబ్వే vs ఆఫ్ఘనిస్థాన్ — బులవాయో
అక్టోబర్ 12: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్ ఏ — పార్ల్
అక్టోబర్ 12: న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ — కుగోంపో సిటీ
అక్టోబర్ 13: ఇంగ్లండ్ vs శ్రీలంక — విండ్‌హోక్
అక్టోబర్ 13: దక్షిణాఫ్రికా vs క్వాలిఫయర్ బి — పార్ల్
అక్టోబర్ 14: భారత్ vs ఆఫ్ఘనిస్థాన్ — ట్ష్వానే
అక్టోబర్ 15: పాకిస్థాన్ vs క్వాలిఫయర్ ఏ — బ్లోమ్‌ఫొంటెయిన్
అక్టోబర్ 15: జింబాబ్వే vs ఆస్ట్రేలియా — హరారే
అక్టోబర్ 16: శ్రీలంక vs బంగ్లాదేశ్ — డర్బన్
అక్టోబర్ 16: దక్షిణాఫ్రికా vs ఇంగ్లండ్ — గ్కెబెర్హా
అక్టోబర్ 17: భారత్ vs క్వాలిఫయర్ ఏ — బ్లోమ్‌ఫొంటెయిన్
అక్టోబర్ 17: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్ బి — హరారే
అక్టోబర్ 18: ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్థాన్ — కుగోంపో సిటీ
అక్టోబర్ 19: జింబాబ్వే vs పాకిస్థాన్ — హరారే
అక్టోబర్ 19: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ — డర్బన్
అక్టోబర్ 20: న్యూజిలాండ్ vs శ్రీలంక — జోహన్నెస్‌బర్గ్
అక్టోబర్ 20: ఇంగ్లండ్ vs క్వాలిఫయర్ బి — హరారే
అక్టోబర్ 21: ఆఫ్ఘనిస్థాన్ vs క్వాలిఫయర్ ఏ — కుగోంపో సిటీ
అక్టోబర్ 22: ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ — పార్ల్
అక్టోబర్ 22: దక్షిణాఫ్రికా vs శ్రీలంక — జోహన్నెస్‌బర్గ్
అక్టోబర్ 23: ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ — గ్కెబెర్హా
అక్టోబర్ 23: బంగ్లాదేశ్ vs క్వాలిఫయర్ బి — ట్ష్వానే
అక్టోబర్ 24: జింబాబ్వే vs భారత్ — విక్టోరియా ఫాల్స్
సూపర్-7 దశ
అక్టోబర్ 25: A2 vs B3 — జోహన్నెస్‌బర్గ్
అక్టోబర్ 26: B1 vs A3 — గ్కెబెర్హా
అక్టోబర్ 27: B2 vs AB4 — ట్ష్వానే
అక్టోబర్ 28: A1 vs A2 — విక్టోరియా ఫాల్స్
అక్టోబర్ 29: B1 vs B3 — కుగోంపో సిటీ
అక్టోబర్ 30: A3 vs AB4 — విక్టోరియా ఫాల్స్
అక్టోబర్ 31: B2 vs A1 — జోహన్నెస్‌బర్గ్
నవంబర్ 1: A2 vs B1 — విక్టోరియా ఫాల్స్
నవంబర్ 2: B3 vs AB4 — కేప్‌టౌన్
నవంబర్ 3: B2 vs A3 — డర్బన్
నవంబర్ 4: A1 vs B1 — పార్ల్
నవంబర్ 5: A2 vs AB4 — డర్బన్
నవంబర్ 6: B2 vs B3 — బ్లోమ్‌ఫొంటెయిన్
నవంబర్ 7: A1 vs A3 — కేప్‌టౌన్
నవంబర్ 8: B1 vs AB4 — డర్బన్
నవంబర్ 9: B2 vs A2 — గ్కెబెర్హా
నవంబర్ 10: A3 vs B3 — బ్లోమ్‌ఫొంటెయిన్
నవంబర్ 11: A1 vs AB4 — గ్కెబెర్హా
నవంబర్ 12: B2 vs B1 — కేప్‌టౌన్
నవంబర్ 13: A2 vs A3 — బ్లోమ్‌ఫొంటెయిన్
నవంబర్ 14: A1 vs B3 — డర్బన్
సెమీఫైనల్స్, ఫైనల్
నవంబర్ 17: సెమీఫైనల్ 1 — కేప్‌టౌన్
నవంబర్ 18: సెమీఫైనల్ 2 — ట్ష్వానే
నవంబర్ 21: ఫైనల్ — జోహన్నెస్‌బర్గ్
భారత్–పాకిస్థాన్ మ్యాచ్: అక్టోబర్ 10, జోహన్నెస్‌బర్గ్. రెండు జట్లు సూపర్-7 దశకు చేరితే మరోసారి తలపడే అవకాశం ఉంటుంది. సెమీఫైనల్ లేదా ఫైనల్లోనూ ఎదురుపడే అవకాశం ఫార్మాట్ ఆధారంగా ఉంటుంది.
Also Read : ఐసీసీ కొత్త రూల్స్: క్రికెట్లో కీలక మార్పులు!
Follow Us On: Youtube

