కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ వేదికగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల (Gaddar Film Awards) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు సినీ, రాజకీయ దిగ్గజాలు ఎందరో అటెండ్ అయ్యారు. ముఖ్యంగా ఈ వేడుకలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పుష్ప చిత్రంలోని పాపులర్ సాంగ్ ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి’ అనే పాటను సింగర్ శ్రేయా ఘోషల్ పాడగా, రష్మిక ఎంతగానో మురిసిపోయింది. ఈ పాట రష్మిక కోసమే పాడుతున్నట్లు సింగర్ చెప్పడంతో ఆనందం వ్యక్తం చేసింది. ఆ పాటకు తగ్గట్టుగా ముఖంలో హావభావాలు పలికించి ఆకట్టుకుంది.
ఆ తర్వాత సింగర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఆశ్చర్యపర్చింది. వివాహం తర్వాత రష్మిక మొదటిసారి ఇలా బహిరంగ వేడుకలో కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అభిమానులు ఆమెను ‘తెలంగాణ కోడలు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

