‘ధురంధర్ ది రివెంజ్’పై ఎన్టీఆర్ ప్రశంసల వర్షం

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ‘ధురంధర్ ది రివెంజ్’ (Dhurandhar The Revenge) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమా ఒక తుఫాను లాంటి అనుభూతిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఎన్టీఆర్, హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఆయన నటన అద్భుతమని, స్క్రీన్‌పై మాస్టర్‌ క్లాస్‌ను అందించారని అన్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ప్రతి సన్నివేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారని ఎన్టీఆర్ అభినందించారు.

ఈ సినిమా భావోద్వేగాలను రేకెత్తిస్తూ, ముగింపు తర్వాత కూడా ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుందని తెలిపారు. మాధవన్ తన సహజమైన నటనతో మరోసారి మెప్పించారని, ప్రతి సన్నివేశంలో ఆధిపత్యం చాటారని పేర్కొన్నారు. అలాగే సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా లోతైన నటనను ప్రదర్శించారని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన మ్యూజిక్ సినిమాను మరింత ఉత్కంఠభరితంగా మార్చిందని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>