కలం, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే అరుదైన దృశ్యం (Rare Wildlife Moment) ఆవిష్కృతమైంది. ఒకే రహదారిపై పెద్దపులి, నెమలి కనిపించడంతో వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. మసినగుడి నుంచి ముదుమలై (Mudumalai) వెళ్లే రహదారిపై ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
రోడ్డు పక్కన నిలిచిన నీటిని ఓ పెద్దపులి ప్రశాంతంగా తాగింది. అనంతరం నెమ్మదిగా రహదారిని దాటింది. అదే సమయంలో మరోవైపు నుంచి ఓ నెమలి కూడా రోడ్డు దాటడంతో అక్కడి వాహనదారులకు అరుదైన దృశ్యం (Rare Wildlife Moment) కనువిందు చేసింది. ఒకవైపు పెద్దపులి, మరోవైపు నెమలి కనిపించడంతో వాహనదారులు తమ వాహనాలను నిలిపి ఈ అద్భుత దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Also Read : మహేశ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. వాయిదా తప్పదా?
Follow Us On: X(Twitter)

