మహేశ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. వాయిదా తప్పదా?

కలం, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘వారణాసి’ మూవీ (Varanasi Movie) వాయిదా పడబోతుందని తెలుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీని 2027 ఏప్రిల్ 7వ తేదీకి విడుదల చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. మూవీ షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ ముందు అనుకున్న తేదీలోగా సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అందుకే, సినిమాను పోస్ట్ పోన్ చేయడమే అన్ని రకాలుగా మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్. 2027 జులై 29, ఆగస్ట్ 5, ఆగస్ట్ 12వ తేదీలను మూవీ మేకర్స్ పరిశీలిస్తున్నపట్లు సమాచారం. ఈ మూడింటిలో ఒక తేదీని లాక్ చేయొచ్చని.. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.

భారీ బడ్జెట్ మూవీగా రికార్డ్..

పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న వారణాసికి సుమారు రూ.1,000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కే.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తీకేయ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియాలో అన్ని భాషలు, ప్రపంచంలోని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీని కోసం రాజమౌళి టీం భారీ కసరత్తు చేస్తోంది. డబ్బింగ్ పనులకే చాలా సమయం తీసుకుంటుందోని మూవీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో హడావిడిగా పూర్తి చేసి మూవీని థియేటర్లలోకి తీసుకురావడం కంటే.. క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వాలనేదే రాజమౌళి ఆలోచనగా చెబుతున్నారు. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే మూవీ విడుదల వాయిదా వేయాలని భావిస్తున్నారట. అదే జరిగితే మహేశ్ ఫ్యాన్స్ కొంత నిరాశ చెందే అవకాశం ఉంది.

Also Read : వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>