బయ్యారంలో అరుదైన గుడ్లగూబ.. ఎవరీ చంద్రముఖి?

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో ఓ అరుదైన గుడ్లగూబ కనిపించింది. గాయపడిన గుడ్లగూబను స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాలుకు గాయం కావడంతో చికిత్స అందించారు. ఇది అరుదైన చంద్రముఖి జాతికి చెందినదని తెలిపారు. గుడ్లగూబ (Owl)ను త్వరలో హైదరాబాద్ జూపార్క్‌కు తరలిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున అరుదైన జీవులు, పక్షులు కనిపిస్తుంటాయని స్థానికులు చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>