రాప్తాడు ఘటన.. నిందితుడు హేమంత్ దారుణాలు ఇవే!

కలం, వెబ్ డెస్క్ : రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్‌ రంపంతో జరిగిన ఘోర దాడి (Raptadu school attack) ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు హేమంత్‌కు సంబంధించి పలు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

తల్లిదండ్రులు చిన్నప్పుడే మృతి చెందడంతో హేమంత్ కొంతకాలం తన అక్క సంరక్షణలోనే పెరిగాడు. అయితే అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో అక్క కూడా ఇంటి నుంచి పంపించివేసింది. దీంతో అనంతపురం శివారులో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసముంటూ టమాటా మండీలో కూలీగా పనిచేస్తున్నాడు. మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు బానిసైన నిందితుడు గతంలో రాప్తాడు బీసీ బాలుర వసతిగృహానికి వెళ్లి అక్కడి విద్యార్థులపై కూడా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

గోపికకు వరసకు సోదరుడైన హేమంత్, కొంతకాలంగా ఆమె పాఠశాలకు వెళ్లే సమయంలో అనుసరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని తోటి విద్యార్థినులు తెలిపారు. ఈ విషయంపై గోపిక తల్లిదండ్రులు గతంలోనే అతడిని మందలించినప్పటికీ, అతను తన పద్ధతి మార్చుకోలేదు.

పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆ అవకాశాన్ని హేమంత్ పక్కా ప్రణాళిక కోసం వాడుకున్నాడు. మెటీరియల్‌తో కూలీలు ఆటోలో పాఠశాలకు వచ్చిన సమయంలోనే, కూలీ వేషంలో వారి వెనుకే పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించాడు. పాఠశాల సిబ్బంది కూడా అతనిని పనుల కోసం వచ్చిన కూలీగానే భావించారు.

ఉదయం 10 గంటల సమయంలో పదో తరగతి గది వద్దకు వెళ్లిన నిందితుడు, తరగతి గది బయటే ఎలక్ట్రిక్ రంపాన్ని ఆన్ చేశాడు. శబ్దం విని చెట్ల కొమ్మలు కత్తిరిస్తున్నాడని భావించిన ఉపాధ్యాయురాలు ప్రశ్నించేలోపే, హేమంత్ గదిలోకి దూసుకెళ్లి గోపికపై రంపంతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడి అనంతరం రంపాన్ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>