రత్నాపూర్ కాండ్లీలో ఆజాద్ జయంతి వేడుకలు

కలం, నిర్మల్ రూరల్ : స్వాతంత్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ గడ్డం హరీష్ అన్నారు. ఆదివారం నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లీ (Ratnapur Kandli) గ్రామంలో కలాం గుణం సొసైటీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ దేశంలో విద్యారంగ అభివృద్ధికి, సాంకేతిక విద్యకు విశేష ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ భీమేష్, సొసైటీ వ్యవస్థాపకులు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>