ఇండి కూటమి ర్యాలీ ఎఫెక్ట్: 12 వేల కోట్ల వ్యాపారం బంద్?

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండి కూటమి నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ (INDIA Bloc Rally) నగరంలోని వ్యాపార వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పండుగ సీజన్ కావడంతో ఈ సభ కారణంగా వేలాది కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతింటుందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆ సంస్థ నాలుగోసారి లేఖ రాసింది.

ర్యాలీ జరిగే ప్రాంతానికి చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో సుమారు 2.5 లక్షల దుకాణాలు మూతపడే అవకాశం ఉందని, అలాగే రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్థంభించిపోయే ప్రమాదం ఉందని CTI చైర్మన్ బ్రిజేష్ గోయల్ తెలిపారు. ముఖ్యంగా ప్రధాన మార్కెట్లలో దాదాపు 80 శాతం మేర వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవచ్చని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం దీపావళి పండుగ సీజన్ కావడంతో రోజువారీగా సుమారు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయని, ర్యాలీ వల్ల ఈ టర్నోవర్ భారీగా పడిపోతుందని హెచ్చరించారు. వ్యాపారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ర్యాలీ నిర్వహణపై తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ కాంగ్రెస్ పార్టీని కోరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>