దారుణం.. కన్నబిడ్డలు, భార్య సహా ఆరుగురిని చంపేసిన కిరాతకుడు!

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనపై పోక్సో కేసు నమోదు చేశారనే కక్షతో ఓ వ్యక్తి మొత్తం ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ (Shabad Six Murders)  మండలం దైవాలగూడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఓ బాలికను వేధించాడంటూ దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌పై మే 16న బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని మే26న అరెస్ట్ చేశారు. అతడు జూన్ 10 ( శుక్రవారం) బెయిల్ పై విడుదలై గ్రామానికి తిరిగివచ్చాడు. ఇదే క్రమంలో శనివారం తెల్లవారుజామున తన భార్య సరిత (30), మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడిని కత్తితో పొడిచి చంపేశాడు.

ఆ తర్వాత బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి బాధితురాలి తల్లి లక్ష్మి, నానమ్మ రక్కమ్మ లను చంపేసిన అతడు.. బాధిత బాలికను ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారం జరిపి మరీ హత్య చేశాడు. ఆరుగురి హత్యల అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసిన నిందితుడు రాజ్ కుమార్.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ దారుణ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: ఆ ప్రాజెక్టుతోనే అసలు ముప్పు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>