ఆ ప్రాజెక్టుతోనే అసలు ముప్పు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్​ రెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ స్పందించారు. శనివారం హైదరాబాద్​ లోని తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్​ రేవంత్​ పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం వల్ల భద్రాచలానికి ఎలాంటి ప్రమాదం లేదని.. పోలవరం ప్రాజెక్టు వల్లే పెను ముప్పు వాటిల్లుతుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ఎత్తు పెంచడం వల్లే ఈ ప్రమాదం ఉందన్నారు. దీనికోసం ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలో కలిపారని కేటీఆర్ గుర్తు చేశారు. పోలవరం గురించి గట్టిగా మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని రేవంత్​ రెడ్డి మాట్లాడడం లేదని కేటీఆర్​ విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్​ తెచ్చిన కరువు మాత్రమేనని కేటీఆర్​ ఆరోపించారు. రోజుకు 2 టీఎంసీలు ఎత్తితే ప్రాజెక్టులన్నీ నిండుతాయన్నారు. 2022లో 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి మేడిగడ్డకు ఏమీ కాలేదని ఆయన గుర్తు చేశారు.

247 టీఎంసీలు తట్టుకున్న మేడిగడ్డ 9 టీఎంసీలను తట్టుకోలేదా ? అని ప్రశ్నించారు. రైతులు పంటల కోసం ఆందోళన పడుతుంటే సీఎం రేవంత్​ రెడ్డి మాత్రం పంపులు ఆన్​ చేయకుండా ప్రతిపక్షాలపై రంకలేస్తున్నారని కేటీఆర్​ దుయ్యబట్టారు. తమ మీద కక్ష్య ఉంటే బూతులు తిట్టండి.. కానీ రైతుల నోట్లో మన్ను కొట్టొద్దని ఆయన కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>