కలం, యాదగిరిగుట్ట : తన జన్మదిన వేడుకలు సందర్బంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) అన్నారు. తన నలభైఐదు సంవత్సరాల రాజకీయంలో ప్రజలు చూపిస్తున్న అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూన్నానన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ప్రజలు తనపై చూపించే ప్రేమానురాగాలు చిరస్థాయిగా ఉండాలని అన్నారు. భవిష్యత్ లో రానున్న డిలిమిటేషన్ తో ప్రజలే సరియైన సమాధానం చెప్తారని మోత్కుపల్లి (Motkupalli Narasimhulu) పేర్కొన్నారు. శనివారం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం ఉందని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎవరూ ట్రస్ట్ బోర్డు కి అర్హులు కాలేరా లేదా కావాలనే పక్కన పెట్టి జిల్లా ప్రజలను అవమానించారా అని ప్రశ్నించారు. ట్రస్ట్ బోర్డు ఏర్పాటు విషయంలో స్థానిక ఎమ్మెల్యే కు కూడా అవమానం జరిగిందన్నారు.
Read Also: సీఎం రేవంత్ ఎమోషనల్ పోస్ట్.. ఏమన్నారంటే!
Follow Us On: X(Twitter)

