ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం

కలం, వెబ్​ డెస్క్​ : కరేబియన్ దేశమైన బహామాస్‌లో ఘోర విమాన ప్రమాదం (Bahamas Plane Crash) చోటు చేసుకుంది. శుక్రవారం ఆ దేశ 53వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల వేళ జరిగిన ఈ విషాదంలో మొత్తం 10 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి ఫిలిప్ డేవిస్ అధికారికంగా ప్రకటించారు. లిండన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శాన్ ఆండ్రోస్ విమానాశ్రయానికి బయలుదేరిన సెస్నా 402 విమానం కాసేపటికే కుప్పకూలింది.

సాంకేతిక సమస్య కారణంగా అదుపు తప్పి పొదల్లో కూలినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులు, ఒక పైలట్ ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికక్కడే తొమ్మిది మంది దుర్మరణం పాలవ్వగా.. ప్రాణాలతో బయటపడ్డ ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు పోలీస్ కమిషనర్ శాంటా నోల్స్ తెలిపారు. తొలుత ఒకరు ప్రాణాలతో బయటపడినప్పటికీ, అనంతరం చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>