‘చరిత్ర తెలుసుకోండి’.. అమెరికాకు భారత్ కౌంటర్!

కలం, వెబ్ డెస్క్: భారతీయ ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) స్పందించారు. జేడీ వాన్స్ వ్యాఖ్యలు అసలు నిజాలను దాచిపెట్టేలా ఉందని, అనవసరమైనవిగా స్పష్టం చేశారు. ఇది ఇరు దేశాలపై సానుకూల ప్రభావం చూపే ప్రకటన కాదన్నారు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు అత్యంత తెలివైన, నైపుణ్యం ఉన్నవారని.. వారి వలన ఆ దేశానికి కూడా ఎంతో లాభం జరిగిందని వివరించారు. వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వారి శ్రమ, ఆవిష్కరణ వలనే అమెరికా దేశం నేడు ఈ స్థాయిలో ఉందని.. చరిత్ర తెలుసుకోవాలని సూచించారు.

వీసా దారులపై ప్రభావం ఉండదు..

అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ పెర్మ్ ప్రోగ్రాంను రద్దు చేయడం వలన హెచ్–1బీ వీసాదారులపై ప్రభావం ఉండదని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘ప్రస్తుత వీసాదారులు, వారి కుటుంబ సభ్యులకు వచ్చిన నష్టం లేదు. కాకపోతే.. పెర్మ్ ప్రోగ్రాంతో అనుసంధానమై ఉన్న కంపెనీలకు చెందిన ఉద్యోగులు గ్రీన్ కార్డులు, శాశ్వత నివాస హోదా ఉన్నవారిపై ఇది కొంత మేర ప్రభావం ఉండొచ్చు. ప్రతిభావంతులైన ఉద్యోగుల కారణంగా అమెరికా, భారత ఆర్థిక వ్యవస్థలు లాభపడుతూనే ఉన్నాయి. ఇది రెండు దేశాలకు పరస్పర ప్రయోజనం కల్పించే అంశం. అమెరికా చేసిన ప్రకటన ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాలను మాత్రం ఏమాత్రం ముందుకు తీసుకెళ్లేలా లేదు’ అని పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>