కలం, మధిర: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మధిర మండలంలోని పలు పాఠశాల (Madhira Schools) ల్లో శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. నిధానపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు గుమ్మడి, తంగేడు, బంతి పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పాటలు, నృత్యాలతో సందడి చేశారు.
అలాగే మడుపల్లి పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ చుట్టూ కోలాటాలు ఆడారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం తోట నరసింహారావు విద్యార్థులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు శైలజ, సంధ్య లక్ష్మి, శ్రీదేవి, మాధురి, సుష్మ, సీత, సువర్ణ, భాను తదితరులు పాల్గొన్నారు.

