హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ను గద్దె దించాలి: రమాదేవి

కలం, బాసర : కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు డాక్టర్ పడకంటి రమాదేవి ఆరోపించారు. ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ ముథోల్ నియోజకవర్గం బాసర మండలం (Basara Mandal) లాబ్ది గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామ పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు సైతం సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి రేవంత్ ప్రభుత్వంలో నెలకొందని విమర్శించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>