రంజాన్ పండుగ.. హైదరాబాద్‌లో సందడి వాతావరణం

కలం, వెబ్ డెస్క్: రంజాన్ పండుగ (Ramadan Festival) సందర్భంగా హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. మక్కా మసీదులో వేల మంది ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మీరాలం ఈద్గాలో ప్రార్థనలకు ముస్లింలు భారీగా తరలివస్తున్నారు. రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఒకరికొకరు ఆలింగనాలు చేసుకుంటున్నారు. రంజాన్ సందర్భంగా పాతబస్తీలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ప్రార్థనల కోసం రోడ్లపైకి భారీగా ముస్లింలు వస్తుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నారు. నగరంలోని హైకోర్టు, సిటీ కాలేజీ, జూపార్క్, మీరాలం ట్యాంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రంజాన్ వేళ పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీగా ట్రాఫిక్ అవుతుండటంతో దారి మళ్లింపులు చేపట్టారు.

పండగవేళ ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మాజీ సీఎం కేసీఆర్ (KCR) రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జాగృతి అధ్యక్షురాలు కవిత ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మెదక్‌ జిల్లాలోని నవాబుపేటలో ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా గొల్లగూడెం ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అటు రంజాన్ సందర్భంగా ఖిలా వరంగల్ ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలకు మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈద్గాలు, మసీదులకు ముస్లింలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఢిల్లీలోని జామా మసీదు వద్ద వేలమంది ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా అక్కడి పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>