రామ్ చరణ్​ ‘పెద్ది’ విడుదల వాయిదా!

కలం, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్​ హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. లేటెస్టుగా ఈ మూవీని జూన్ నెలలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది.

చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం.. సినిమాలోని టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం ఒక్కసాంగ్ షూటింగ్ మాత్రమే ఉంది. ఎడిటింగ్ పనులు కూడా ఒక్క కొలిక్కి రావడంతో, సినిమా అవుట్ ఫుట్ చూసి మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. అయితే ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వాలనే ఉద్ధేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం కొంత సమయం కేటాయించాలని టీమ్ భావిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో నాణ్యత కోసం సినిమాను జూన్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కచ్చితమైన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్‌ ఇరానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై, ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో ఘనంగా విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన చికిరి చికిరి పాట ఎంతటి ఆదరణను తెచ్చుకుందో అందరికి తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై అడియెన్స్ నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>