Mobile Popup Ad
Mobile Popup Ad

రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ షూటింగ్ బిగ్ అప్డేట్..

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘పెద్ది’ (Peddi). వృద్ది సినిమాస్ పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఏప్రిల్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఇటీవల షూటింగ్‌లో రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో షూటింగ్ డిలే అయిందని.. రిలీజ్ డేట్ కూడా మారుతుందని ప్రచారం జరిగింది. కానీ పెద్ది (Peddi) సినిమా షూటింగ్ ఒక్క పాట మినహా మొత్తం పూర్తయిందని.. అనుకున్న తేదీకి ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని రామ్ చరణ్ వెల్లడించారు.

తాజాగా ఈ సినిమాలో మిగిలి ఉన్న భారీ ఐటం సాంగ్‌ సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. ఏప్రిల్ 6 నుంచి ఈ సాంగ్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది. ఏకంగా 300 మంది డాన్సర్స్‌తో ఈ సాంగ్ గ్రాండియర్‌గా ఉండనుందని సమాచారం. అయితే ఈ సాంగ్‌లో క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>