Mobile Popup Ad
Mobile Popup Ad

ఇక యుద్ధమే..! టీవీకే విజయ్​ పై రజినీ ఫ్యాన్స్ ఫైర్

కలం, వెబ్​ డెస్క్​ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamil Nadu Elections) వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా దళపతి విజయ్ (Vijay) తన పార్టీ తమిగళ వెట్రి కజగం(TVK)ను ఈ సారి బరిలోకి దించడంతో తమిళనాడు ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే విజయ్ వరుస వివాదాల్లో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే ఓ నటితో రిలేషన్ కారణంగా విజయ్ పై ఆయన భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయగా.. విజయ్ కొడుకు సైతం ఆయన్ని సోషల్ మీడియాల్లో అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఫ్యాన్స్ విజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ పోస్టర్లు రిలీజ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో రజనీకాంత్ (Rajinikanth)పై విజయ్ (Vijay) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ కి డీఎంకే అంటే భయం.. అందుకే రాజకీయాల్లోకి రాలేదని వ్యాఖ్యానించారు. విజయ్ చేసిన వ్యాఖ్యలపై రజినీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులో రజినీకాంత్ ఫ్యాన్స్ పోస్టర్లు కలకలం రేపుతోంది. “మీరు రాజకీయాల్లోకి వస్తారని ఎదురుచూసి మోసపోయాం. మిమల్ని నమ్ముకున్నందుకు మాకు మిగిలింది అవమానలే. నిన్నగాక మొన్న వచ్చినవారు మనల్ని విమర్శిస్తున్నారు. మిమల్ని అవమానించిన వారికి గుణపాఠం చెబుతాం. ఇక యుద్ధమే” అంటూ రజినీ ఫ్యాన్స్ పోస్టర్లు రిలీజ్ చేశారు. దీంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మరోవైపు అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్​డీఏతో పొత్తుకు TVK అధినేత విజయ్ అంగీకరించారని ఓ ప్రచారం సాగింది. ఎన్​డీఏ కూటమిలో చేరేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం చేసినట్లు గాసిప్స్ వినబడ్డాయి. అయితే ఈ వార్తలను TVK అధినేత విజయ్ ఖండించారు. సిద్ధాంతాల పరంగా బీజేపీ తమకు శత్రువని.. ఆ పార్టీతో పొత్తు లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని జవాబిచ్చారు. పార్టీపై జరుగుతున్న ఊహాగానాలను నమ్మొద్దని పార్టీ శ్రేణులకి సూచించారు.

Read Also: ఏదో ఒకటే ఉండాలి.. పెట్రోలియం శాఖ కొత్త షరతు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>