కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలే కాకుండా, సస్పెన్షన్లు కూడా చేపడుతున్నారు. ఇటీవల వారం వ్యవధిలోనే జిల్లాలో రెండు చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి మణుగూరు మండల కేంద్రంలోని జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాల కాగా, మరొకటి దమ్మపేట మండలం గండుగుల పల్లి లోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ కావడం గమనార్హం.
గత సోమవారం మణుగూరులో (Manuguru) ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుని వారం కూడా గడవక ముందే, కారకులైన ఇద్దరిని కలెక్టర్ శనివారం సస్పెండ్ వేటు వేశారు. హాస్టల్లో భోజనం చేసిన బాలికల్లో 24 మందికి వాంతులు, కడుపునొప్పితో అస్వస్థత కు గురికావడాన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ వారిపై కఠిన చర్యలకు తీసుకున్నారు. కలుషిత ఆహారమే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన హెడ్ మాస్టర్, డిప్యూటీ వార్డెన్ లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన కలెక్టర్ తీసుకున్న కఠిన నిర్ణయంతో జిల్లా (Bhadradri Kothagudem) వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. గతంలో ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరయ్యేవారు కాదు. కానీ నూతన కలెక్టర్ అంకిత్ (Collector Ankit), అధికారులు అందరూ ప్రజా వాణికి 10 గంటల వరకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో, ఇప్పుడు అందరూ సమయానికి హాజరవుతున్నారు. అలాగే శనివారం జరిగిన సస్పెన్షన్ తో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు కూడా దారికి వస్తారని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.
Read Also: ఎల్పీజీ కష్టాలకు చెక్.. ఆల్టర్నేట్‌గా డీఎంఈ..
Follow Us On: Facebook

