కలం, వెబ్డెస్క్: ఓ మహిళ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే ప్రాణాల మీదకు వచ్చింది. ఆస్పత్రి పైకప్పు పెచ్చులు ఊడి మీద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్ (Rajasthan) లోని చురు జిల్లా సుజన్గఢ్ మహిళా ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా రోగి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో పైకప్పు ప్లాస్టర్ ముక్క ఊడి తలపై పడింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడే డాక్టర్లు చికిత్స అందించారు. తల భాగంలో రెండు కుట్లు కూడా వేశారు.
ఆమె వెనకే ఉన్న మరో మహిళ వెంటనే పక్కకు తప్పుకోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. ఆస్పత్రి భవనం శిథిలావస్థలో ఉందని ఇప్పటికే చాలా సార్లు ఫిర్యాదులు వచ్చాయి. ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బంది, రోగులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రి యంత్రాంగం భవనం మరమ్మతుల కోసం ప్రజా పనుల శాఖకు లేఖ రాసింది. ఈ ఘటనతోనైనా వెంటనే మరమ్మతులు చేయించాలని కోరింది.

